స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు…?
*సాష్టాంగ నమస్కారం!* ➖➖➖✍
స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు…?
భారతీయ హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం రెండవది పంచాంగ నమస్కారం.
భగవంతునికి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు.
కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అంటారు.
అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి ?
సాష్టాంగ నమస్కారం :
స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం.
ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్ళూ, రెండు కనులూ భూమిపై ఆన్చి చేయునది ఇలా పురుషులు చేయవచ్చు.
కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుదనే మన వారి ధర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు.
ఇంకా చెయ్యాలనుకుంటే నడుం వంచి ప్రార్థించవచ్చు. ఇలా శరీర భౌతిక నిర్మాణాన్ని బట్టి ఈ సూచన చేయబడింది.
అది పాటించడం వల్ల స్త్రీల ఆరోగ్యానికి మేలు జరగుతుంది. స్త్రీలు నమస్కరించుకోవాలనుకొన్నప్పుడు ‘పంచాగ’ నమస్కారాన్ని ‘అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే తాకేలా నమస్కరించుకోవడం మంచిది.✍
లోకా సమస్తా సుఖినోభవన్తు!
ఆదిత్య హృదయం
Sri Lakshmi Ashtottara Shatanamavali Telugu శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
Aura Sheath and it’s 7 layers ఆరా షీత్ – దాని 7 పొరలు – విశ్లేషణ
Best Ayurveda books in telugu ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు
మన సనాతన హిందూ ధర్మం – మత్యయంత్రం తెలుగులో
విష్ణువు వేయి నామములు – Vishnu Veyi Namalu in Telugu