శ్రీరామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఏంటి?
శ్రీరామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఏంటి? నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడదెబ్బ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పుణ్యకార్యాలలో పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
ఆదిత్య హృదయం
Sri Lakshmi Ashtottara Shatanamavali Telugu శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
Aura Sheath and it’s 7 layers ఆరా షీత్ – దాని 7 పొరలు – విశ్లేషణ
Best Ayurveda books in telugu ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు
మన సనాతన హిందూ ధర్మం – మత్యయంత్రం తెలుగులో
విష్ణువు వేయి నామములు – Vishnu Veyi Namalu in Telugu