సీతా రాముల గోత్ర ప్రవరలు – ఇరువురి వంశ వైభవం
Lord Rama Pravara, Matha Sita Pravara in Telugu
రాబోయే శ్రీరామ నవమి “శ్రీ సీతారాముల కల్యాణోత్సవం” సందర్భంగా ఇరువురి వంశ వైభవాన్ని తెలుసుకుందాం ! శ్రీరామనవమి రోజున కళ్యాణ సందర్భంలో ఈ సీతా రామ గోత్ర ప్రవరలు విన్నంత మాత్రాన వంశవృద్ధి కలుగును
రఘువంశ వర్ణన
(దశరథ మహారాజు పూర్వీకులు)
చతుర్ముఖ బ్రహ్మ
మరీచి –>
కశ్యపుడు –>
సూర్యుడు –>
మనువు –>
ఇక్ష్వాకుడు –>
కుక్షి –>
వికుక్షి ->
భానుడు –>
అనరంయుడు –>
పృథుడు –>
త్రిశంకువు –>
దుందుమారుడు ->
మాంధాత –>
సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్
ధృవసంధి->
భరతుడు –>
అశితుడు –>
సగరుడు –>
అసమంజసుడు –>
అంశుమంతుడు –>
దిలీపుడు –>
భగీరతుడు –>
కకుత్సుడు –>
రఘువు –>
ప్రవృద్ధుడు –>
శంఖనుడు –>
సుదర్శనుడు –>
అగ్నివర్ణుడు –>
శీఘ్రకుడు –>
మరువు –>
ప్రశిశృకుడు –>
అంబరీశుడు –>
నహుశుడు –>
యయాతి –>
నాభాగుడు –>
అజుడు –>
దశరథుడు –>
రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు.
జనక వంశ వర్ణన
(జనక మహారాజు పూర్వీకులు)
నిమి చక్రవర్తి –>
మిథి –>
ఉదావసువు –>
నందివర్దనుడు –>
సుకేతువు –>
దేవరాతుడు –>
బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.
మహావీరుడు –>
సుదృతి –>
దృష్టకేతువు –>
హర్యశృవుడు –>
మరుడు –>
ప్రతింధకుడు –>
కీర్తిరతుడు –>
దేవమీదుడు –>
విభుదుడు –>
మహీద్రకుడు –>
కీర్తిరాతుడు –>
మహారోముడు –>
స్వర్ణరోముడు –>
హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు.
జనకుడు –> సీత, ఊర్మిళ
కుశద్వజుడు –> మాంఢవి, శృతకీర్తి
శ్రీరామనవమి “శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము” జరుగుతున్న శుభ సందర్భంగా…వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.
శ్రీరామ ప్రవర
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే…
అజ మహారాజ వర్మణః పౌత్రాయ…
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ…
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
సీతాదేవి ప్రవర
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం…
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం…
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం…
జనక మహారాజ వర్మణః పుత్రీం…
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం…
ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.
మా అత్మీయులైన మీకందరికీ…
శ్రీరామనవమి శుభాకాంక్షలు.


శ్రీ రామ నవ రాత్రుల సందర్భంగా, ప్రస్తుత విపత్కర పరిస్థితులకు అందరూ శ్రీ రామ రక్షా స్తోత్రం చేసుకుందాం.
శ్రీ రామ నవమి మకుట ధారణ శ్లోకము
కారాగారంలో పుట్టిన కన్నయ్య… యమున దాటి గోకులానికి! శ్రీకృష్ణ జననం వెనుక దివ్యగాథ
కృష్ణాష్టమి 2026… అర్ధరాత్రి అవతరించిన జగన్నాథుడు! శ్రీకృష్ణ జన్మ విశిష్టత ఏమిటి?
కృష్ణాష్టమి నాడు ఇంట్లో చిన్నికృష్ణుడి పాదాలు ఎందుకు వేస్తారు?
కృష్ణుడికి వెన్న అంటే ఎందుకంత ప్రీతి? బాలకృష్ణుని కథల్లోని అంతరార్థం