ఆహార నియమాలు
* ఆమము , విదగ్ధము , విష్టంభము , రసశేషము అను భేదములచే అజీర్ణము నాలుగు విధములుగా ఉండును. వీటన్నిన్నిటికి మజ్జిగ ఔషధముగా పనిచేయును .
* భోజనాంతరము చేతిని కడుగుకొనిన తరువాత అరచేతితో నేత్రములను తుడుచుకొనిన గాని , అరచేతితో నీటిబొట్టును నేత్రములలో వేసుకొనినగాని నేత్రరోగములు మానును .
* భోజనము చేసి పనిలేకుండా కూర్చుండువాడు లంబోదరుడు అగును . భుజించిన తరువాత శయనించువారికి సుఖము కలుగును. భోజనము చేసి కొంత సమయము తరువాత శ్రమించువానికి ఆయుర్వృద్ది కలిగి మరణము దూరము అగును.
* ఆకలిగా ఉన్నప్పుడు భుజించుతూ , ఎడమవైపు తిరిగి పడుకొనినవానికి వైద్యునితో పని ఉండదు.
* ఆకలితో ఉన్నవాడు సమయానికి భుజించని యెడల కట్టెలు లేని ఆగ్నిహోత్రము వలే జఠరాగ్ని నశించి శరీరము కృశించును .
* భోజనం చేసిన పిమ్మట ఎడమప్రక్కకు తిరిగి పడుకుండిన యెడల పిత్తాశయము నుండి ఆహారం జీర్ణం అగుటకు కావలసిన పైత్యరసము సరిగా ప్రసరించి జఠరాగ్ని వృద్ది అగును. కావున భోజనానంతరం ఎడమప్రక్కకు తిరిగి పడుకొనవలెను .
* నిద్రపోవు కాలము నందు ఎడమప్రక్కన పరుండినప్పుడు 32 సార్లు , కుడివైపు పరుండినప్పుడు 25 సార్లు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసములు వెడలును. ఇతర విధముల పరుండప్పుడు పదిసార్లు కలుగును.
* అనవసరముగా ఔషధసేవన చేయుట , కుడివైపు ఎక్కువుగా పడుకోవడం , భోజనమునకు బదులు ఇతరవస్తువులు భుజించటం వలన మనుష్యునకు తృప్తి కలగవచ్చును కాని అనారోగ్యం తప్పక కలుగును .
* జఠరాగ్ని ఆహారమును వచింప ( జీర్ణం ) చేయును . ఆహారం లేనివారికి ఈ జఠరాగ్ని శరీరమునే దహింపచేయును . దానివల్ల సర్వధాతువులు క్షీణించి ప్రాణములు కూడా పోవును .
* భోజనం చేసిన పిమ్మట భుక్తాయాసం తగ్గువరకు కొంచంసేపు విశ్రాంతి తీసికొనవలెను . తరువాత 100 అడుగులు అటుఇటు తిరగవలెను. కుర్చొని లేచుచూ ఉండవలెను .
* భుజించిన ఆహారం మరునాటికి రసధాతువుగాను , మూడొవ రోజుకి రక్తముగాను , నాలుగొవ రోజుకి మాంసముగాను , అయిదోవ రోజుకి మేధస్సుగాను , ఆరోవరోజుకి అస్థిధాతువుగాను , ఏడోవ రోజుకి మజ్జి ధాతువుగాను , ఎనిమిదొవ నాటికి ఉత్క్రుష్టమైన శుక్రధాతువుగా మారును .

కారాగారంలో పుట్టిన కన్నయ్య… యమున దాటి గోకులానికి! శ్రీకృష్ణ జననం వెనుక దివ్యగాథ
కృష్ణాష్టమి 2026… అర్ధరాత్రి అవతరించిన జగన్నాథుడు! శ్రీకృష్ణ జన్మ విశిష్టత ఏమిటి?
కృష్ణాష్టమి నాడు ఇంట్లో చిన్నికృష్ణుడి పాదాలు ఎందుకు వేస్తారు?
కృష్ణుడికి వెన్న అంటే ఎందుకంత ప్రీతి? బాలకృష్ణుని కథల్లోని అంతరార్థం
కృష్ణుడి వేణుగానం… భక్తులను అంతగా ఆకట్టుకోవడం వెనుక భావమేమిటి?
శ్రీకృష్ణుడు మనకు నేర్పే జీవన పాఠాలు… గీతలోనే కాదు, ఆయన జీవితమంతా సందేశమే!