1.ఆలయాల్లో గంటలు ఉండటానికి కారణం
ఆలయాల్లో ఉండే గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజం అవుతాయట. అంతేకాదు మెదడు కుడి, ఎడమ భాగాలు రెండూ కొంత సేపు ఏకమవుతాయట. దీంతోమన మనస్సుకు ప్రశాంతత కలుగుతుందట. ఏకాగ్రత పెరుగుతుందట. గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయట. అందుకోసమే మన పూర్వీకులు ఆలయాల్లో గంటలు కొట్టాటన్ని ఒక ఆచారంగా మనకు అలవాటు చేసారు.
2.ఆడవారు గాజులు ధరించడం వెనుక కారణం
మన పెద్దలు చేసిన ప్రతి పనికి ఒక ఆరోగ్య సూత్రం ఆధారంగా రూపొందించరూ. స్రీలు గాజులు ధరించటం మనకు ఒక ఆచారం. ఆ గాజుల ధరించటం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుందట.
3.పిల్లలకు చెవులు కుట్టించటం వెనుక కారణం
చిన్నారులకు చెవులు కుట్టించడం సహజమే. ప్రధానంగా ఆడపిల్లలకు, ఆ మాటకొస్తే కొంత మంది మగ పిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి దాంతో వారికి వచ్చే అనారోగ్యాలు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట.
4.రావి చెట్టును పూజించటం ఎందుకో తెలుసా
హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ చెట్లయితే ఎక్కువగా దేవాలయాల్లోనే ఉంటాయి. అయితే సాధారణంగా చెట్లన్నీ పగటి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందట. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.
5. ఆడవారు కాలి వేళ్లకు మెట్టెలు ధరించటం ఎందుకో తెలుసా?
హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. అయితే వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట.
6. నిద్రించేటప్పుడు తలను ఉత్తరానికి పెట్టకపోవడం ఎందుకు
భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్టుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుందట. ఒక వేళ మనం ఉత్తరం దిశగా తలను పెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ మెదడుకు ప్రవహించి బీపీ, గుండె సంబంధ సమస్యలు వస్తాయట. తలనొప్పి, అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ డిసీజ్ వంటి వ్యాధులు వస్తాయట. కాబట్టి తలను ఉత్తరం దిశకు పెట్టి నిద్రించకూడదట.
7. నుదుటన కుంకుమ బొట్టు ధరించడం వలన ఉపయోగం ఏమిటి
మన సనాతన ధర్మల్లో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ మనం ఇది ఒక అలంకారంలా మార్చి స్టిక్కేర్స్ పెట్టుకున్నాం. కుంకుమ తిలకం పసుపు, పటిక మరియు నిమ్మ రసంలా మిశ్రమం. నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట.
8.ఎదుటి వారికి రెండు చేతులతో నమస్కరించడం వెనుక శాస్త్రయ కారణం ఏమిటో తెలుసా
ఇప్పుడు ప్రపంచం మొత్తం మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించే పనిలో ఉన్నారు. మన పెద్దలు అలవాటు చేసిన అతిముఖ్యమైన సంస్కారం నమస్కారం. మనం ఎవరినైన కలిసినప్పుడు మొదట నమస్కరించి పలకరిస్తం. కానీ మన అలవాట్లు అన్ని మారిపోయి షేక్ హ్యాండ్ వచ్చింది, మన ఎదురుగా ఉన్న వారికి రెండు చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామట. ఎలాగంటే రెండు చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి మన జ్ఞాపకశక్తిని పెంచుతాయట. దీంతోపాటు మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుందట.
9. నేలపై కూర్చుని భోజనం చేయడం మంచిది అని మన పెద్దలు ఎందుకు చెప్పారు
మనం తీసుకునే ఆహారం నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట అందుకోసమే మనం ఆహారం తీసుకొనే సమయంలో నేలపై కూర్చొని భోజనం చెయ్యటం మంచిది అని అంటారు.
10. కారమైన ఆహారం ముందు, స్వీట్లు తరువాత తినడం ఏమైనా పరమార్థం ఉందా
భోజనం చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణంచేయనీయదట.
11. నదుల్లో నాణేలు వేయమని కూడా మన ఆచారాలు చెప్పాయా
ఒకప్పుడు మన దగ్గర రాగితో చేసిన నాణేలు చలామణీలో ఉండేవి. ఆ సమయంలో మన అవసరాలకి నదుల్లో నీరే ఉపయోగించే వారు. ఇక్కడి ఈ కారణంగా ఆ నాణేలను నదుల్లో వేసే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేదట. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూరమయ్యేవట. ఇప్పుడు మన నాణేలు నదుల్లో వేయటం వలన ఏమి ఉపయోగం ఉండదు.
12. ఉపవాసం ఉండడం ఎందుకో తెలుసా
హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉపవాసం ఉంటారు కదా.ఆయుర్వేద ప్రకారం అలా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణవ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్ట బడతాయట. దీంతోపాటు దేహం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుందట. ఉపవాసం ఉండడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రావట!!!
ఇవి క్లుప్తంగా కొన్ని ఆచారాలు వాటి అంతరార్ధాలు. మీకు ఎమన్నా ఇతర సందేహాలు ఉంటె అడగండి మేము మాకు సాధ్యమైనంతవరకు తీర్చటానికి ప్రయతినిస్తాము.
సర్వే జన సుఖినోభవంతు!!! సర్వే సుజనా సుజనా భవంతు
ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం…
ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం…
ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ…
షడ్రసముల గురించి వివరణ షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై…
ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు - ఆయుర్వేద ప్రశస్తి . - 1986 .ఆంగ్ల…
*యంత్రము, మంత్రము, తంత్రము.* హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని సర్వశక్తులు ఆదిశక్తి…