అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏది లోపించినా బ్రతకగలం కానీ అన్నం లోపిస్తే బ్రతకలేం.
దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు పెద్దలు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చిన ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది కానీ అన్నదానం లో మాత్రం తీసుకున్నవారు
ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు.
ఏ దానం ఇచ్చిన దానం తీసుకున్న వారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కానీ అన్న దానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని
పూర్తిగా సంతృప్తిపరచవచ్చు.
చిన్న కథ చెప్తా చదవండి
పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు.
ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. ‘నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను’ అని అరిచాడు. ఆ సాధుపుంగవుడు శాంతంగా ‘నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి ‘స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను’ అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా.
3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.
సాధువతనిని ఓదార్చి ‘బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు’ అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.
దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.
కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.
ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.
చేతనైనంత వరకు అన్నదానం చేద్దాం.
ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం…
ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం…
ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ…
షడ్రసముల గురించి వివరణ షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై…
ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు - ఆయుర్వేద ప్రశస్తి . - 1986 .ఆంగ్ల…
*యంత్రము, మంత్రము, తంత్రము.* హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని సర్వశక్తులు ఆదిశక్తి…