Proven methods of Indian Habits భారతీయ ఆచారాలు- ఆధారాలు

🙏పాత అలవాట్లు 👇

ఒకప్పుడు మూఢనమ్మకము, శాస్త్రీయం కాదు అనే, అనేక అంశాలు సైంటిఫిక్ గా నిరూపించబడ్డాయి.

ఉదాః కి దక్షిణము వైపు చూస్తూ పడుకోరాదు. అది యమ స్థానమ్..
అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసి మరీ కనుక్కున్నారు, అలా పడుకోరాదని, భూమ్యాకర్షణ శక్తి వల్ల జరిగే మాగ్నెటిక్ ఫీల్డ్స్ కారణముగా బుర్రలో చెడు పరిణామాల గూర్చి, మరి మన వాళ్ళు యముడు అన్నది అందుకే కదా! ఇలాంటివే మరికొన్ని 👇

మన వాళ్ళు బ్రహ్మముహూర్తంలో ధ్యానము,జపాదులు చెయ్యడం ఉత్తమం అని సూచించారు. OBE(out of body experience) సమాధి స్థితిలో మొదటి దశ గురించి, పాశ్చాత్యులు కనుగొన్న విషయం ఏంటంటే ఎక్కువ శాతం obe లు పొద్దున 04 నుంచి 6.30 గం. మధ్యలో జరుగుతాయని కనుగొన్నారు. వారు obe లో చెప్పిన అంశాలు, ఒక సాధకుడికి మూలాధారం జాగృతం అయినప్పుడు కలుగుతాయి.

రాత్రిళ్ళు చెట్టుకింద పడుకుంటే.. దెయ్యాలు వచ్చి గుండెల మీద కూర్చుంటాయి అని చెప్పేవారు. ఇప్పుడు CO2 వల్ల ఊపిరి ఆడదు అంటున్నాము.

మన పూర్వీకులు ఆచారాలుగా చెప్పిన విషయాలను logic గా ఆలోచించి ఇవి శాస్త్రీయమైనవని అంటారు. విదేశీయులు… వాటిని నమ్మి పరిశోధనలు చేసి, అవి నిజము అని, నిరూపించుచున్నారు.

Ex: ఏకాదశినాడు ఉపవాసం లేదా నిరాహారదీక్ష ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు చెప్పారు. ఒక జపాన్ శాస్త్రవేత్త క్యాన్సర్ వ్యాధికి విరుగుడుగా సంవత్సరములో 28 రోజులు, ఒక రోజులో 10 గంటలు కడుపు ఖాళీగా ఉంచితే క్యాన్సర్ వ్యాధిరాదని నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందాడు.

కనుక సనాతన ధర్మాలు, ఆచారాలన్నీ కూడా TESTED, పామరులు కూడా సులభంగా ఆచరించే విధంగా.. ఆచార వ్యవహారాలను, మన పూర్వీకులు నియమించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.

సూర్యోదయాత్పూర్వమే స్నానం చేసి, సూర్యునికెదురుగా నిల్చొని, సూర్యనమస్కారాలు చేస్తే.. ఆరోగ్యానికి ఢోకా ఉండదని చెప్పారు పెద్దలు.
కానీ నేటి తరాలకి సెకండ్ షో సినిమా/లేదా టివీ/లేట్ నైట్ పార్టీ.. ఆ పైని కబుర్లు, పడుక్కునే సరికి దాదాపు రెండు దాటుతోంది, మరి సూర్యుడు రాకుండా ఎలా లేస్తారు? అందుకే ఈ ఆచారాలను చాదస్తం అనేసారు. కానీ, ఇప్పుడు అలా చేస్తే ఏమవుతోందో… స’శాస్త్రీయంగా’ వైటమిన్ డి లోపం, ఎండలో కూర్చోండి, అదీ పొద్దుటి పూటైతే D-Vitamin బాగా శరీరంలో ఏర్పడి, కాల్షియం బాగా ఎముకల్లోకి వెళ్తుంది, పొద్దున్నే యోగా చెయ్యండి.. అంటూ డప్పు తీసుకుని మరీ చెప్తే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎక్కడైనా ఎప్పుడైనా ఎత్తున కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపరాదు, ఇలా చేస్తే దరిద్రదేవతకు ఆహ్వానం అని పెద్దల హెచ్చరిక ❌, అపుడది మూఢనమ్మకం, చాదస్తం, కానీ ఇప్పుడు… అలా వూపడం వలన నరాలు దెబ్బతినడమో, బలహీనపడడమో ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గాయాలపై తులసి పసరు రాస్తే చాదస్తమనేవారు, నేడు …. తులసి ఆయింట్మెంట్ చాలా మంచిదంటున్నారు.

ఉదయం పరగడుపున రాగి చెంబులో నీరు త్రాగమన్నారు మనపెద్దలు, అది చాదస్తంగా తలచారు. ఇప్పుడు రాగి పాత్రలో రాత్రంతా నిలవ వున్న నీరు తాగితే మీఆరోగ్యం ఆయుష్షు పెరుగుతాయని డాక్టర్లు చెపుతున్నారు. అందుకని ఇప్పుడుచాలామంది రాగి వాటర్ బాటిల్ లోనీరు తాగుతున్నారు. ఏదైనా శంఖంలో పోస్తేనేగానీ తీర్థంకాదు.

పని మనుషులు అన్నీ ముట్టుకోకూడదు అని పెద్దలు చెప్పారు. ఇప్పుడు అన్నీ ఇతరుల చేత చేయించుకుంటుంన్నందు వలననే శరీరం విశాలంగా పెరిగిపోతోందని తేల్చారు.

సూర్యోదయం కాకముందే లేవాలి
అనే నియమం ఒకటుంది. దీనికి కారణం ఏమంటే… పగలు,రాత్రి అనేక తిండిపదార్థాలు తింటాము. రాత్రిపడుకునే ముందు, చెంబుడు నీరు త్రాగిపడుకోమన్నారు. మనం నిద్రించిన తరువాత, జఠరం బాగా పనిచేసి, వ్యర్థాలను బయటకు నెడుతుంది. మలముమూత్రముల ద్వారా కొంత చెమటద్వారా, కొన్ని వ్యర్థాలు మరియు ఇంకా కొంత మలినము ఫాలభాగాన పేరుకుంటుంది. ఇది సూర్యోదయమైతే మరలలోపలి కెళ్ళిపోతుంది. అందుచే బద్ధకం,తలనొప్పి మొదలగునవి ఏర్పడుతాయి. కావున సూర్యోదయాత్పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని, ముఖప్రక్షాళనం చేసుకుంటే ఆ రోజల్లా ఉత్సాహంగా ఉంటుందారోగ్యం. అందుకే సూర్యోదయానికి ముందులేవమన్నది. కాని వింటున్నారా మనవాళ్ళు?

బయట ఆహారం తినద్దు, పొద్దున్నే లేవండి, నీళ్ళు చక్కగా తాగండి, ఉతికిన వస్త్రాలనే ధరించండి, ఛాతీ,పొట్ట భాగాలను నొక్కి వుంచే బట్టలను వేసుకొనివ్వకండి పిల్లలని, మగవాళ్ళని.

6 కల్లా శరీర మలినాలు విసర్జించే వ్యవస్థని అలవాటు చేసుకోండి,
వెంటనే స్నానం చేయండి.

జుట్టుని ఎక్కువ సేపు దువ్వండి, ఇంట్లో వెంట్రుకలు లేకుండా, తల్లో పేలు లేకుండా చూసుకోండి.

వీలైనంత.. మౌనంగా వుండటానికి ప్రయత్నం చేయండి.

మన పూర్వపు ఆచారాలు పాటించండి, శరీరానికి పని చెప్పండి, మన పూర్వీకులు చెప్పిన ఆచారాలు, పాత అలవాట్లు మళ్ళీ జీవితంలోకి తెచ్చుకుందాం, అమలు చేద్దాం…🙏

Share

Recent Posts

ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం…

3 years ago

Sri Lakshmi Ashtottara Shatanamavali Telugu శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం…

4 years ago

Aura Sheath and it’s 7 layers ఆరా షీత్ – దాని 7 పొరలు – విశ్లేషణ

ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ…

4 years ago

షడ్రసముల వివరణ

షడ్రసముల గురించి వివరణ షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై…

4 years ago

Best Ayurveda books in telugu ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు

ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు - ఆయుర్వేద ప్రశస్తి . - 1986 .ఆంగ్ల…

4 years ago

మన సనాతన హిందూ ధర్మం – మత్యయంత్రం తెలుగులో

 *యంత్రము, మంత్రము, తంత్రము.*  హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని స‌ర్వ‌శ‌క్తులు ఆదిశ‌క్తి…

4 years ago