*యంత్రము, మంత్రము, తంత్రము.*
హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని సర్వశక్తులు ఆదిశక్తి నుండి ఉద్భవించాయి. ఈ విశ్వ మాతకు ఒక నిర్ధిష్ట రూపంలేదు. అయితే ధ్యానశక్తితో ఆ రూపాన్ని దర్శించిన ఋషులు ఒక యంత్రరూపాన్ని మనకు ప్రసాదించారు. ఈ యంత్రం రేఖలు, వృత్తాలు, త్రిభుజాలుగా ఈ సువిశాల విశ్వానికి ప్రతిబింబంగా రూపొందించారు.
యంత్రము అనగా ముందుకు వెళ్లేవి, మనలను ముందుకు నడిపించునవి అని అర్ధం. అనగా, ఎవరైతే ఒక దైవ యంత్రాన్ని ఆరాధిస్తూ ఉoటారో వారికి తప్పక భగవదానుగ్రహం లభించి తీరును. అమ్మవారి లలితా సహస్రనామాలకు మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాసనా లని అమ్మవారి నామాలని చెప్పబడుచున్నది. అంటే అన్ని యంత్రములకు ప్రతినిధి అమ్మవారే.
భగవంతుని ప్రాణ శక్తి యంత్రరూపంగానే ఉంటుంది. ఏ దేవాలయం నిర్మాణం జరిగినా ధ్వజస్ధంబం నిలబెట్టినా, దేవతా విగ్రహం ప్రతిష్టకంటే ముందు, యంత్ర ప్రతిష్ట చేస్తారు. కారణం ఆ నిర్ధేశిత యంత్రానికి ఉండే అమోఘమైన శక్తి ఆ దేవతా మూర్తిలో ప్రవేశించి అమోఘమైన చైతాన్యాన్ని కల్గిస్తున్నది.
మన భారతదేశమున ఆదిశంకరాచార్యుల వారు అనేక దైవక్షేత్రాలలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన చేయబట్టి లోకం అంతా శాంతి సుభిక్షాలతో పాడిపంటలతో వర్ధిల్లి చున్నది. నేడు తిరుమలేశుని వైభవం ఇందులకు తార్కాణం. అటువంటి శక్తి, ఒక యంత్రానికి మాత్రమే ఉన్నది. యంత్రాలు బంగారు రేకుల మీద, వెండి మీద, రాగి మీద, అరతి ఆకుమీద, ఇంకా కాగితం మీద కూడా గీస్తారు. యంత్రం అవసరం ఉపయోగాన్ని బట్టి దేనిమీద గీయాలో మంత్ర గ్రంధాలు తెలుపివున్నాయి. వ్యాపారస్తులు ‘ధన జనాకర్షణ యంత్రం ‘ పెట్టుకుంటారు. దాని వల్ల వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని నమ్మకం.
సకల వాస్తు దోషాలు పోగొట్టుకోవాలంటే గోడలు పగలగొట్టుకుని, ఇల్లు మళ్ళీ కట్టుకోనక్కర్లేదు, మత్స్య యంత్రం ఒకటి పూజించి ఇంట్లో పెట్టు కుంటే వాస్తు దోషాలు నివారించ బడతాయి. కూర్మ యంత్రం స్థిరత్వానికి చిహ్నం. నరఘోష యంత్రం కొంత దృష్టిదోషాన్ని నిర్మూలిస్తుంది. ప్రతి యంత్రంలోను రాయబడిన బీజక్షరాలు, త్రికోణ, వర్తుల, చతురస్ర నిర్మాణాలు ఆయా శక్తులని, దిక్పాలకులని, విశ్వంలో ఆ మూల ప్రకృతికి చెందిన ఆది శక్తిని ప్రేరేపించి మంచి యోచన, ఆనందకరమైన వాతావరణాన్ని కలగ చేస్తాయి. కొన్ని యంత్రాలని ధరిస్తారు కూడా. మరీ ఫొటో ఫ్రేం అంత కాకుండా, చిన్న తాయెత్తుల్లో యంత్రాలని ధరించ వచ్చు. దీర్ఘకాల వ్యాధులకి ఇవి బాగా పనిచేస్తాయి. మంత్ర జపాలు చేయలేని వారు, యంత్రాల ద్వారా కార్యాన్ని సాధించ వచ్చు. మంచి యంత్రాన్ని అర్చించి, శక్తివంతం చేసుకుని, ఫలితాలను పొందవచ్చు. మేరుతంత్రం లాంటి గ్రంధాలుతెలుపు తున్నాయ.
*మత్స్య యంత్రము*
మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి ‘మత్స్యావతారము’. విష్ణు దశావతారములలో మొట్టమొదటి అవతారమే మత్స్యావతారము వేద సముద్ధరణకై అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపము. ఈ యంత్రము, ఇతర యంత్రముల కంటే చాలా విశిష్టమైనది. సమస్త వాస్తు దోష నివారణ యంత్ర రాజము ఇది. ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము – దాని ప్రస్థారము నందు గల సప్తావరణలలోను అతి ముఖ్యము శక్తివంతమైన బీజాక్షరములతో రూపొందించబడి, సర్వ సాంప్రదాయాను కూలoగా నిర్మించబడింది.
పూజా విధి ఈ మత్స్య యంత్రమును శాస్త్రాను సారముగా దైవజ్ఞులచే తయారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ కళాన్యాస, ప్రాణప్రతిష్ట జరిపించి, శుభ సమయ మున యంత్ర పూజ, జపాదులను ప్రారంభించ వలెను. ఈ యంత్రమును శక్తివంతముగా చేయుటకై విధి విధానమును మిగిలిన యంత్రముల కన్న కొంచెం ఎక్కువగానే నిర్ధేశింప బడినది.
మత్స్య యంత్రంను ఐదు శేర్ల ధాన్యములో ఒక దినం, పంచామృతము లందు ఒక దినం మంచి నీటిలో ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును చేసి మూల మంత్రజపము పూర్తి అయ్యిన పిదప శంఖు స్థాపన చేసిన గృహ స్థలములలో ఈయంత్రము ఏర్పాటు చేసుకోవాలి. ఈ యంత్రంను స్థాపన చేయుట వలన ద్వార దూష్యములు, కూప వేధలు, స్తంభ వేధలు, వీధి శూలలు ఆయుర్ధాయము నశించిన గృహదోషములు, శంఖు స్థాపన చేయక కట్టిన దోషము మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.
మత్య యంత్ర మంత్రం తెలుగులో
ఓం ఐం హ్రీం శ్రీం మత్య్సాసనాయ సోమకాసుల భంజనాయ మహావిష్ణవే అణిమాద్యష్టవిభూతిం దేహిదేహిస్వాహాః
(అవకాశానిబట్టి 108 సార్లు చేయవలసినది).
అనంతరం
ఓం తత్పురుషాయ విద్మహే మహామీనాయధీమహి
తన్నోమత్స్యః ప్రచోదయాత్ (11సార్లు)
అనంతరం
ఏతత్ఫలం మత్స్యస్వరూప మహావిష్ణుదేవతార్పణమస్తు, ఓం తత్సత్
ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం…
ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం…
ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ…
షడ్రసముల గురించి వివరణ షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై…
ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు - ఆయుర్వేద ప్రశస్తి . - 1986 .ఆంగ్ల…
🙏పాత అలవాట్లు 👇ఒకప్పుడు మూఢనమ్మకము, శాస్త్రీయం కాదు అనే, అనేక అంశాలు సైంటిఫిక్ గా నిరూపించబడ్డాయి. ఉదాః కి దక్షిణము…