మానస సరోవర్ యాత్ర భక్తశులభుడు లయకారకుడు అయిన పరమేశ్వరుని స్థిరనివాసము భారత దేశమునకు ఉత్తరముననున్న హిమాలయములలోని కైలాస పర్వతమని దీనికి చేరువలోని మానస సరోవర్ సరస్సునందు దేవతలు అందరూ నిత్యము స్నానము చేయుదురు అనియు పురాణములు ఘోషించుచున్నవి.ఒక్క బదరీనాధ్ క్షే త్రము తప్ప విష్ణుక్షేత్రములు అన్నియు భారతధేశమునందు అన్ని రాస్త్రములలో వ్యాపించియున్నవి. కలియుగదైవమైన వేంకటేశ్వరుడు చిత్తూరుజిల్లా తిరుమలనందు ఏడుకొండలపై కొలువై ఏడుకొండలవానిగా కీర్తింపబడుచున్ననూ ప్రముఖ శైవక్షేత్రములన్నియు పర్వతప్రాంతమునందు మాత్రమే ఉండుట విశేషము. పంచకేదార్ క్షేత్రములైన కేదార్నాధ్, మధ్యమహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాధ్, కల్పెశ్వర్ మరియు నేపాల్ నందు పశుపతినాధ్ ముక్తినాథ్ మొదలైన అన్నిశైవ క్షేత్రములు హిమాలయ పర్వతశ్రేణులలోనే ఉన్నవి. జీవనదులు గంగా యమునల జన్మస్థానము ఇదే పర్వతశ్రేణులలో గంగోత్రి యమునొత్రీలుగా చార్ ధామ్ పుణ్యక్షేత్రములలో వెలుగొందుచున్నవి. బదరీనాధ్ వద్ద అలకనందనదిగా జన్మించి మందాకిని తదితర ఉప నదులతో సంగమమై పవిత్ర గంగానదిగా దేవప్రయాగ నుండి ఋషీకేశ్, హరిద్వార్ మీదుగా పుణ్య కాశీ క్షేత్రము అనబడు వారణాశి చేరుటకు ముందుగా అలాకానంద యొక్క అయిదు సంగమ క్షేత్రములు దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ మరియు విష్ణులేదా కృష్ణప్రయాగ అను పంచప్రయాగ క్షేత్రములు హిమాలయములలోనే ఉన్నవి. పరమేశ్వరుని నివాస స్థలము పవిత్ర కైలాస పర్వతము మరియు దేవతల నివాసము మానససరోవర్ ఈపవిత్ర పుణ్యక్షేత్రములతో పాటుగా హిమాలయములలోనే వెలుగొందు చున్నవి. పర్వత ప్రాంతమున నడక కావున ఈ యాత్ర చేయువారు ప్రతిరోజూ కనీసము 4 నుండి 5 కి.మీ నడక అలవాటు చేసుకొన వలయును. మానస సరోవర్: మానస సరోవర్ హిమాలయములలో ఒక రహస్యమైన అంతుచిక్కని నిగూఢ ప్రదేశము.ఈ మానస సరోవరంలో అను నిత్యం పరమేశ్వరుడు పార్వతీమాతతో పాటు అందరూ దేవతలు ప్రాతః కాలమునకు ముందే స్నానము చేసేదరని ప్రతీతి. ఈ పవిత్ర ప్రదేశములోనే హిందూ దేవతలు అందరూ నివసించెదరని నమ్మకం. ఋషులు, నాగ సాధువులు మరియు అఘోరాలు వేల సంవత్సరములుగా ఆహారము మరియు ఆశ్రయము లేకుండా కేవలము గాలి పీల్చుకొని ఈ హిమాలయ పర్వత ప్రాంతములో తపస్సు చేయుచుంటారాని ప్రసిద్ది.
ఈ తపస్సు చేయుచున్నఋషులు మరియు అఘోరాల వయస్సు నిర్ధారణ చేయుట ఊహకు అందనిది.. కోట్లాది రూపాయలఖర్చుతో అత్యంత ప్రతిష్టాత్మకముగా జరిపే కుంభమేళా సమయమునందు ఈ ఋషులు, నాగసాధువులు మరియు అఘోరాలు పల్లపు ప్రాంతములో కల వారణాశి, అలహాబాద్, హరిద్వార్ తదితర యాత్రా స్థలములకు దిగి వచ్చేదరు. ఇటీవల ప్రయాగ నందు 2019 నందు 4500 ఖర్చుతో కుంభమేళా నిర్వహించి నారు. ఈ కుంభమేళా నకు వచ్చిన జన సంద్రోహముతో గిన్నీస్ బుక్ నందు స్థానము సంపాదించినది. వీరు అందరు అన్ని వేల సంవత్సరములు ఎలా జీవించి ఉంటారో విజ్ణానము నకు అందని విషయము. యోగులు మోక్షము పొందే వరకు ఐహిక సుఖములు వదలి ఇంకా ఇంకా జ్ణానము సంపాదించాలని జీవిస్తూంటారు. యోగులు హట యోగము చేయుటవలన గుండె కొట్టుకొనుట మరియు గాలి పీల్చుకొనుట నియత్రించి వార్ధక్యము రాకుండా మోక్షము సిద్ధించే వరకు జీవనము సాగిస్తారు. కొందరు యోగులు వారికి గల శక్తిచే పంచేద్రియములను అదుపులో ఉంచుకొన గలుగుతారు. మానవులు నిత్య జీవితములో కలుగు సుఖదుఃఖములు అనుభావిస్తూ 70 లేదా 80 ఏండ్లు బ్రతికి పిమ్మట మరణిస్తూంటారు. జీవితములో శారీరకము, భావోద్వేగము, పరిణామ క్రమము అనే మూడు మార్గములు ద్వారా శక్తిని కోల్పోవుతుంటారు. ఈ సాధువులకు జీవితముపై ఆశక్తి ఉండదు. వారి శక్తి నంతటిని ఏకాగ్రతపై నిలిపేదరు. వారు వందల సంవత్సరములు తరబడి మధ్య మధ్యలోకొద్దిపాటి విరామములతో మోక్షము పొందేవరకు తపస్సుపై ఏకాగ్రత నిలిపెదరు కావున వారికి ఆహారము అవసరము లేదు. వారి శరీరముపై పుట్టలు, చెట్లు చేరినా లేక మంచు అలముకొన్న కూడా వారికి మరణము సంభవించదు.మనస్సు ఏకాగ్రతకు జీవముతో ఉండుటకు మాత్రమే వారికి శక్తి అవసరము.వారు తమ మూడవకంటిపై దృస్థి నిలిపెదరు కావున వారికి ఏకాగ్రతకు మాత్రమే శక్తి అవసరము. మోక్షము సాధించుట నెమ్మదిగా జరుగునది ఎక్కువ సమయము తీసుకొనును కావున సాధారణ ఒత్తిడులనుండి విముక్తులుగా ఉండుట ఉపయోగపడుతుంది. మానస సరోవరం చైనా దేశ సరిహద్దులో స్వయంపాలిత టిబెట్ నందు అతి ఎత్తు ప్రదేశములో కైలాసపర్వతము వద్ద ఉన్న ఒక మంచి నీటిసరస్సు. ఈ సరస్సు హిందూ, బౌద్ధ మరియు జైన మతములకు భగవంతుడు ప్రసాదించినది అని నమ్ము స్థలము. ‘మన’ అనగా బుద్ధి మరియు ‘సరోవర’ అనగా సరస్సు. సముద్ర మట్టమునకు సుమారు పదిహేను వేల అడుగుల ఎత్తులో ఈ మానస సరోవరము ఉన్నది. మూడు వందల అడుగుల లోతుగాను గుండ్రము గాను పెద్ద విస్తీర్ణము కలిగి గంగానదితో రక్షతల్ సరస్సు వద్ద ఉన్నది. మానస సరోవర్ నందలి అధికపు నీరు, ఉప్పునీటితో నిండి యుండు రక్షతల్ సరస్సునకు పారును.
ఈ సరస్సులు సట్లెజ్ నది పరీవాహక ప్రాంతమును వేరు చేయుచున్నది. వేసవి కాలములో అందమైన ఈ ప్రాంతము హంసలకు నివాసము. మానస సరోవరము స్వచ్ఛతకు ప్రతిభింబముగా భూమిపై బ్రహ్మచే సృస్టించబడినది. ఈసరస్సు నీరు త్రాగుటవలన అన్నిరకముల పాపములను పోగొట్టి మరణానంతరము శివసాన్నిధ్యము కలిగించును భగవద్గీతనందు పీర్కోనబడిన అయిదు పవిత్ర సరస్సులు మానస సరోవర్, బిందు సాగర్, నారాయణ సరోవర్, పంపా సరోవర్ మరియు పుష్కర సరోవర్ అనునవి.
బౌద్ధులు అనవతప్త మరియు మాయ దంపతులు బుద్ధునికి ఇచట జన్మనిచ్చినట్లుగా తలచెదరు. ఈ సరస్సుపై బౌద్ధమత గ్రంధములలో అనేక ప్రవచనములు మరియు కధలు కలవు. బుద్ధుడు ఇచట అనేకసార్లు తపస్సు చేసినాడు.జైనులలో మొదటి తీర్ధంకరుడైన ఋషభుడు ఈ సరస్సువద్దనే ఉండి అష్టపదశిఖరము పైననే నిర్యాణము చెందియున్నాడు. ఆతని కుమారుడు ఈఆస్టపదశిఖరము పైననే వజ్రములతో అలంకరించబడిన భవనము నిర్మించినాడు. కైలాస మానససరోవర్ యాత్ర అనునది ప్రతి మానవుని స్వప్నము. కానీ యాత్రలన్నిటిలోకి అత్యంత కస్టమైన యాత్రలు మానస సరోవర్ యాత్ర మరియు అమరానాధ్ యాత్రలు . మానస సరోవర్ మరియు కైలాస పర్వతము చేరుటకు అనేక పర్యాయములు అనేకులు ప్రయత్నించిననూ 2001 సంవత్సరము వరకు మానససరోవర్ ఎవరును చేరియుండలేదు. 2001 సంవత్సరములో ఒక భక్తులగుంపు అనేక విధమైన ఆటంకములు దాటి ఈపవిత్ర ప్రదేశము చేరుకొన్నది. ఈయాత్రలు చేయడానికి శరీరకంగా మరియు మానసికంగా ధృఢత్వము కలిగి యుండవలెను. మానసిక దౌర్భాల్యము కలవారు గానీ శరీర ధృడత్వము లేనివారు ఈ యాత్రలు ప్రయత్నించుట మంచిది కాదు. యాత్ర చేయువారి ధృఢత్వము ముందుగా పరీక్ష చేసి పిమ్మట మాత్రమే యాత్రకు అనుమతించబడుదరు. అమరనాధ్ యాత్ర కంటే కూడా మానస సరోవర్ యాత్ర మరింత కస్టము. మానస సరోవర్ యాత్రకు ఇటీవలి వరకు సుమారు 40 నుండి 50 కిలిమీటర్లు పర్వత ప్రాంతమున నడక ద్వారా చేయవలసి ఉండేడిది. హెలీకోప్టర్ ప్రయాణము అమిత (ఒక్కొక్కరికి రూ2,10,000/-) ఖర్చుతో కూడినది.
ఇప్పటి వరకు మానస సరోవర్ యాత్ర భాహ్యవలయము అంతరవలయము అను రెండు వలయముల ద్వారా చేయవలసి ఉండేదిది. భాహ్యవలయము దర్బిన్ చేరువరకు సుమారు 52 కి.మీ. ప్రయాణించవలెను కైలాష్ పర్వతముచుట్టి వచ్చుటకు అంతరవలయము సుమారు 30 కి.మీ దూరము ప్రయాణించి డర్చిన్ వద్ద ప్రారంభమై వారి వారి శారీరక ధారుద్యము అనుసరించి దిరపుక్ మఠము, ద్రోల్మాల మరియు జూటూల్పుక్ మఠము వద్ద మజిలీ లతో మరలా డర్చెన్ వద్ద చేరవలయును. యాత్రికులు నాలుగు రోజులు కైలాస పర్వత యాత్రలో 30 కి.మీ నడక ద్వారా గడుప వలసి ఉండును. ఆ యాత్ర వివరములు ఈ ప్రకారముగా ఉండేడిది. డిల్లే నుండి ఖాట్మండు విమానము లేదా రోడ్డు మార్గము ద్వారా (1మరియు 2వ రోజు), ఖాట్మండూ నుండి Nyalyam రోడ్డు ద్వారా (3 మరియు 4 వరోజు), (5వ రోజు) Saga, (6వ రోజు) Paryang, (7వ రోజు) Simalkot Purang , Manasa sarovar మరియు Darchan, (8వ రోజు) Yamdwar, (9వ రోజు) Dirapuk(10వ రోజు) Zutulpuk, (11వ రోజు) తిరిగి Durchan చేరి (12వ రోజు) Saga, 13వ రోజు Nyalyam, 14వ రోజు ఖాట్మండూ మరియు (15 వరోజు) డిల్లీ చేరుట ద్వారా యాత్ర పూర్తి అగును. ఇందు 1 నుడి 7వ రోజు దార్చిన్ చేరువరకు మరలా 12వ రోజు నుండి 15వ రోజు వరకు తిరిగి డిల్లీ చేరు వరకు రోడ్డు మార్గము ద్వారా మరియు 8వ రోజు డర్చిన్ నుండి Yamdwar, Dirpuk, Zululpuk తిరిగి డర్చిన్ చేరువరకు 12+12+6=30 కిలోమీటర్లు పర్వతారోహణ అనగా నడక ద్వారా మొత్తము 15 రోజులు యాత్ర చేయ వలసి ఉండేదిది. భారత ప్రభుత్వమువారు ప్రతి సంవత్సరమూ కైలాస మానస సరోవర యాత్ర చేసేడి లక్షలాది యాత్రికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో నుంచుకొని ఈ యాత్ర సమయమును తగ్గించుటకు మరియు పర్వతా రోహణము చేయు దూరము తగ్గించుట ద్వారా ఇంకనూ ఎక్కువమంది యాత్రికులను ఆకర్షించుటకు నేపాల్ మరియు చైనా దేశముల ప్రభుత్వముల సహకారముతో ఈ యాత్రలో ముఖ్య మార్గము చైనాఆధీనము లోని స్వతంత్ర టిబెట్ లోని Lipulekh pass నుండి భారతధేశము నందలి ఉత్తరాఖండ్ రాష్ట్రములోని పిత్రోగ్రహ్ జిల్లాలోని ద్రాచులాపట్టణమునకు సముద్రమట్టమునుండి సుమారు 17000 అడుగుల ఎత్తులో 80 కి.మీ రోడ్డుమార్గము వేయుటకు ప్రతిపాదించి పూర్తిచేసినారు. ఈ రోడ్డు మార్గమునందు ఇంకనూ సుమారు 5 కి. మీ. పూర్తి చేయవలసి ఉన్నది.ఈ మార్గములో ప్రయాణించి దర్భిన్ చేరవలసి ఉంటుంది. భారత దేశ మరియు చైనా దేశము సరిహద్దు ప్రాంతమునకు సుమారు 100 కి.మీ దూరములో పరమశివుని నివాసము అని భావించ బడుచున్న కైలాష్ పర్వతము దానికి సమీపములోనే మానస సరోవర్ ఉన్నవి. కైలాష శిఖర ప్రదక్షణ 30 కి.మీ. మానస సరోవర్ చేరుటకు 5 కి.మీ ట్రెకింగ్ (పర్వతా రోహణ నడక) చేయవలసి ఉండును. ఈ కైలాస పర్వతము మరియు దానికి దక్షణముగా 30 కి.మీ. దూరములో నున్న మానస సరోవర్ యాత్ర భారత ప్రభుత్వ విదేశీయంగా శాఖ వారు మరియు చైనా ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యములో నున్న ప్రభుత్వ సంస్థ Kumaon Mandal Vikas Nigam (KMVN) ద్వారా చేపట్టుటకు ప్రతిపాదించ బడినది. వీరి ఆధ్వర్యములో 2021 నుండి కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభించబడునని ఆశించవచ్చును.
కైలాస పర్వత యాత్ర : కైలాస పర్వతము శివుని నివాసముగా తలచెదరు. ఈ కైలాస పర్వతము భారతదేశము నకు చైనాదేశముతో కల సరిహద్దు నుండి ఉత్తరముగా సుమారు 100 కిలోమీటర్ల దూరములో నున్నది. శివ పార్వతులు నివాసముండేడి దివిలో మేరుపర్వతముగా చెప్పబడు కైలాస పర్వతము సుమారు 21,778 అడుగుల ఎత్తు కలిగి చైనా ఆక్రమిత టిబెట్ నందు అధిరోహించుటకు సాధ్యము కాదని చెప్పబడినది. ఈ శిఖరము అధిరోహించ వలెనని పలుసార్లు పలుమంది ప్రయత్నించి విఫలులైనారు.అంతర్జాతీయ విమర్శకు దారి తీయుటవలన చైనా ప్రభుత్వము కైలాస పర్వతము అధిరోహించుట నిషేధించినది. అనేకమంది శాస్త్రజ్ణులు విదేశీయులు మరియు యాత్రికులు ఈ ప్రాంతము అద్భుత ప్రదేశముగా ఇష్టపడతారు.మహాశివుడు పార్వతీ మాతతో నివాసముండేడి కైలాష శిఖరము అధిరోహించుట సాధ్యము కాదు కాదు కావున కొద్దిమంది మాత్రము కైలాస పర్వతనకు ప్రధక్షణ చేసి తద్వారా కైలాస పర్వత యాత్ర చేయకలుగుతారు. రోడ్డు నిటారుగాను పదునుగాను రాళ్ళతో ఉంటుంది. గంట గంటకు వాతావరణము మారుచూ యాత్రికులు అధిక సూర్యరశ్మితోనూ, అధిక మంచు తోనూ, బలమైన గాలులను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈయాత్ర డర్చన్ వద్ద ప్రారంభమై అక్కడే ముగుస్తుంది. ఈ వలయము డర్చిన్ నుండి Yamdwar, Dirpuk, Zululpuk మీదుగా తిరిగి డర్చిన్ చేరువరకు 12 + 12 + 6 = 30 కి.మీ. వృత్తము కలిగి ప్రధక్షణ ద్వారా చుట్టి వచ్చుటకు మూడు రోజుల వ్యవధి పడుతుంది. కైలాస పర్వత క్రింది భాగమున స్వస్తిక్ ఆకారములో ఒక పెద్ద మంచుపలక కనపడుతుంది. కైలాస మానస సరోవర్ యాత్ర చేయుటకు సూచనలు 1.యాత్రికులు గడియారము తిరుగు మార్గములో నడువ వలేను 2.నవంబరు నుంచి మార్చి వరకు రోడ్డు మంచుతో కప్పబడి అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాబడుతుంది.కావున ఏప్రియల్ నుండి అక్టోబరు మాసముల మధ్య యాత్ర చేయవ్లేను. ఏప్రియల్ నుండి అక్టోబరు మాసములలో జూలై మరియు ఆగస్టు నెలలు వర్షా కాలము కావున బలమైన గాలులు వీచే అవకాశముందును.అందువలన బయలుదేరు సమయమును బట్టి అవసరమిన దుస్తులు మరియు ఇతర సామగ్రి తీసుకు వెళ్లవలసి ఉంటుంది. ప్రధానమైన సౌకర్యాలు, మరియు వసతి ఈయత్రలో మతముల యండలి అతిధి గృహములలో అరియు డేరా ఇండ్లలో లభించును. యాత్రికులు తాము నిద్రపోవుటకు అవసరమైన సామాగ్రి తీసుకు వెళ్లవలసి ఉంటుంది ప్రాధమిక ఆహారము లభ్య మౌతుంది కావున యాత్రికులు టమాటో పాటు తేలిక ఆహారము, తిను బండారములు తీసుకు వెల్ల వలసి ఉంటుంది. 3. సాధారణము సౌకర్యవంతము మరియు వెచ్చని దుస్తులు బలమైన నీటికి తడవని బూట్లు కైలాస మానససరోవర్ యాత్రకు అవసరం అవుతాయి. యాత్ర నందు సౌకర్యము కొరకు యాత్రికులు తేలికైన తక్కువ సామాత్రితో ప్రయాణించ వలెను. సామాగ్రి మోయుటకు గుర్రములు లభ్యమగును.
ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం…
ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం…
ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ…
షడ్రసముల గురించి వివరణ షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై…
ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు - ఆయుర్వేద ప్రశస్తి . - 1986 .ఆంగ్ల…
*యంత్రము, మంత్రము, తంత్రము.* హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని సర్వశక్తులు ఆదిశక్తి…