గొప్ప సందేశం
°°°°°°°°°°°°°°°°
బిచ్చగాడు అడుక్కునేటప్పుడు ‘దానం చెయ్యండి’ అనేబదులు “ధర్మం చెయ్యండి” అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించండి.
పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే: సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చెయ్యాలి.
మొదటి రెండు భాగాలు స్వంతానికి.
మూడోభాగం పన్నులు, తదితరాలు.
నాలుగో భాగం కళాకారులు ,గురువులు,పురోహితులు, సన్యాసులు ఇలాంటి వారికి ఇవ్వాలి. ఇది మన కనీస ధర్మం. దీనికి సంస్కారం అవసరం.
వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని ధర్మం పాటించడం అంటారు.మన ధర్మం మనకి రక్ష. లేదంటే మన అహంకారానికి మనమే బలికాకతప్పదు.
దానగుణం
ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు. “నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్ళ మాత్రం తియ్యగా
వుంటాయి. నీవు ఎంతో విశాలంగా ఉంటావు కానీ నీ నీళ్ళ మాత్రం చాలా ఉప్పగా వుంటాయి. దానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.
అప్పుడు సముద్రం ఇలా అంది. “నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తియ్యగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానేగాని, ఎవరికీ ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పగా వుంటుంది” అంది. అందుకే “ఆ చేత్తో తీసుకోని, ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు” అని మన పెద్దలంటారు.
ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం…
ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం…
ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ…
షడ్రసముల గురించి వివరణ షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై…
ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు - ఆయుర్వేద ప్రశస్తి . - 1986 .ఆంగ్ల…
*యంత్రము, మంత్రము, తంత్రము.* హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని సర్వశక్తులు ఆదిశక్తి…