మన భారతీయత

కైలాస పర్వతం – పరిశోధనాత్మక విశ్లేషణ :

భారతీయ సంస్కతి సాంప్రదాయాలను రామాయణ, మహాభారతాలు లేకుండా ఊహించుకోలేము. అందులో ఉన్న అనేక గాథలను మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతున్నాం. అందువల్లే ధర్మాలు ఇంకా భారతదేశంలో ఆచరణలో ఉన్నాయి. ఇక అటువంటి కథల్లో రావణుడు ఆత్మలింగాన్ని పొందే క్రమంలో ఆ పరమశివుడి దర్శనం కోసం తన పది తలలను ఆహుతి ఇచ్చాడని చిన్నప్పటి నుంచి చాలా సార్లు వింటూ వచ్చాం. అయితే అలా రావణాసుడు తన తలలను ఆహుతి ఇచ్చిన స్థలం ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా చేరుకోవాలి? అన్న విషయాలు చాలా సార్లు మనకి కలిగి ఉండవచ్చు.

కైలాస పర్వతం… సముద్రమట్టానికి 22,028 అడుగుల ఎత్తైన మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరం. కైలాస పర్వతం మరియు చేరుకోవడానికి సాగించే ప్రయాణం అంతరాత్మ పిలుపుగా భక్తులు భావిస్తుంటారు. పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక నెలవులో వేల సంఖ్యలో సాధువులు, సామాన్య మానవులు, తత్వవేత్తలు మరియు దేవతలు సైతం ధ్యాన ముద్రలో ఇక్కడి పవిత్రవాతావరణంలో మమేకమైపోతారు.

టిబెట్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన, కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం. ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్నైన , సింధు నది, సట్లేజ్ నది (సింధూ నది యొక్క ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్రా నది, కర్నాలి నది (గంగా నది యొక్క ఉపనది) ఈ పర్వతపు సమీపంలోనే ఉద్భవిస్తాయి. బోన్ (ఒక టిబెట్ మతం), బౌద్ధ, హిందూ, జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావించబడుతుంది. ఈ పర్వతం టిబెట్ లోని మానససరోవరానికి, రాక్షసతాల్ సరస్సుకి సమీపంలో ఉంది.
సనాతన ధర్మం ప్రకారం దుష్ట శక్తులను, బాధలను నశింపజేసే శివుడు కైలాస పర్వతమనబడే ప్రఖ్యాత పర్వతపు శిఖరాగ్రంలో నివశిస్తాడు, ఇక్కడ ఈయన పార్వతితో కలిసి నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు.
కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. కానీ అది అక్కడ ప్రతిష్ఠించబడిందని , కొంతమంది పరిశోధకుల విశ్వాసం. ఇది భవిష్యత్ శోధన. కైలాస పర్వతం మరియు మానవసరోవరం సృష్టికన్నా పురాతనమైనవిగా ప్రతీతి. నాదం మరియు కాంతులతో మిళితమైన ఈ ప్రాంతంలో నిజమైన యోగి ఓంకారంలో విలీనమైపోతారు. భారతీయ తాత్విక చింతన మరియు నాగరికతకు ఈ ప్రాంతం హృదయ కేంద్రం వలె భాసిల్లుతున్నది. గొప్పదైన మానవసరోవరం భారతీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.

విష్ణు పురాణంలోని కైలాస పర్వతపు వర్ణనలో, దీనికి నాలుగు ముఖాలని, అవి స్ఫటికం, రూబీ, బంగారం, నీలమణి ఏర్పడ్డాయని చెప్పబడింది.ఇది ప్రపంచపు పునాది స్తంభమని, తామర పువ్వు రెక్కలలాగా విస్తరించి ఉన్న ఆరు పర్వత శ్రేణులు కలిసే కేంద్రస్థానంలో ఉంది. కైలాస పర్వతం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి, ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి.

పర్వతం యొక్క ఏటవాలు భాగం కల్ప వృక్షం ఆపాదించుకున్న రీతిలో కనిపిస్తుంది. పర్వతం యొక్క దక్షిణ భాగం నీలమణి, తూర్పు భాగం స్ఫటికం, పశ్చిమ భాగం కెంపు మరియు ఉత్తర భాగం స్వర్ణంగా చెప్పబడింది. కుబేరుని రాజ్యం ఇక్కడే కొలువై ఉందని ప్రతీతి.

మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాల్లో అతి పెద్దదైన, అత్యంత ప్రధానమైన కైలాస నాథ దేవాలయం, పేరు కైలాస పర్వతం పేరు మీద పెట్టబడింది. దీనిలోని అనేక శిల్పాలు శివుడు, పార్వతి, రావణాసురుని కథలని చిత్రించినవే.
తాంత్రిక బౌద్ధులు కైలాసాన్ని చక్రసంవర (డెంచోక్) బుద్ధుని ఆవాసంగా భావిస్తారు. ఈయన శాశ్వతానందానికి ప్రతినిధి. ఇక్కడి చాలా ప్రదేశాలు గురు రింపోచే (పద్మసంభవుడు) తో ముడిపడి ఉన్నాయి. ఈయన క్రీ.శ. 7-8 శతాబ్దాలలో టిబెట్ లోని అనేక ప్రదేశాలలో చేసిన తాంత్రిక అభ్యాసాలు, బోధనలు ఈ దేశంలో బౌద్ధం ప్రధాన మతంగా పరిణామం చెందడానికి దోహదమయ్యాయి.

తాంత్రిక బౌద్ధ ప్రబోధకుడైన మిలారేపా (1052 – 1135) బోన్ మత ప్రబోధకుడైన నారో బోన్-చుంగ్ ని సవాలు చేయడానికి టిబెట్ వచ్చాడని చెపుతారు. ఈ ఇద్దరు మాంత్రికులు భీకరమైన మాంత్రిక మాయజాల యుద్ధం చేసారు కానీ ఎవరూ నిర్ణయాత్మకంగా విజయం సాధించలేదు. చివరికి కైలాస పర్వత శిఖరాగ్రాన్ని ఎవరైతే ముందుగా చేరతారో వారే విజేత అనే ఒప్పందం కుదిరింది. ఆ పోటీలో నారో బోన్-చుంగ్ మాయా ఢంకా మీద కూర్చొని పర్వత శిఖరం ఎత్తుకు ఎగరటం ప్రారంభించాడు. ఇలా ఉండగా, మిలారేపా సావధానంగా కూర్చొని ధ్యానం చేయడాన్ని చూసి ఆయన అనుయాయులు నిశ్చేష్టులయ్యారు. నారో బోన్-చుంగ్ దాదాపు శిఖరాగ్రానికి చేరుకోబుతుండగా మిలారేపా హఠాత్తుగా రంగంలోకి దిగి, సూర్య కిరణాలపై ప్రయాణం చేసి, నారో బోన్-చుంగ్ కంటే ముందే శిఖరాగ్రాన్ని చేరి పోటీలో గెలిచాడు. మిలారేపా అదే సమయంలో గుప్పెడు మంచుని దగ్గరిలోని పర్వతాగ్రంపై చల్లి బోన్పోకు (బోన్ మతావలంబికులను బోన్పో అంటారు) దత్తం చేశాడు. అప్పటినుండి అది బోన్రిగా పిలవబడుతూ, బోన్ మతంతో ఆ ప్రాంతపు సంబంధాలు కొనసాగేలా చేసింది.

1926 లో హ్యూగ్ రట్లెడ్జ్ పర్వతపు ఉత్తర ముఖాన్ని అధ్యయనం చేసి, 6000 అడుగుల ఎత్తున్న శిఖరాగ్రం ఎక్కడానికి చాలా కష్టతరమైనదని తీర్మానించాడు ఈశాన్యపు అంచునుండి ఎక్కేందుకు ప్రణాళిక వేసుకున్

నాడు కానీ, సమయం చాల్లేదు. రట్లెడ్జ్, ఆ ప్రాంతాన్ని కల్నల్ ఆర్.సి.విల్సన్ తో పాటు సందర్శించాడు. విల్సన్ పర్వతానికి అవతలి వైపున, త్సేతెన్ అనే షెర్పాతో పాటు ఉన్నాడు. విల్సన్ చెప్పినదాని ప్రకారం, త్సేతెన్ తాము ఉన్న కోణం (ఆగ్నేయం) నుండి పర్వతాన్ని అధిరోహించే వీలు ఉన్నదని భావించి “సాహిబ్ మనం దాన్ని ఎక్కగలం” అని అన్నాడు. విల్సన్ ఆల్పైన్ జర్నల్ (1928) అనే పర్వతారోహణా పత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని బట్టి, విల్సన్ ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు తీవ్రంగా నిశ్చయించుకున్నాడని తెలుస్తున్నది. కానీ విల్సన్ కూడా సమయాభావం వల్ల ప్రయత్నించలేదు. హెర్బర్డ్ టీచీ 1936లో, గుర్లా మాంధాత పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన, కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అని నగారీకి చెందిన ఒక గార్పోన్ వ్యక్తిని అడగగా, ఆ గార్పోన్ వ్యక్తి “పూర్తిగా పాపరహితమైన వ్యకులు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలరు. అలాంటి వ్యక్తులు ఈ ఏటవాలు హిమకుడ్యాలను ప్రయాసపడి ఎక్కనవసరం లేదు. ఒక పక్షిలాగ మారి శిఖరాగ్రానికి ఎగరగలడు” అని సమాధానిమిచ్చాడట.1980వ దశకం మధ్యలో చైనా ప్రభుత్వం, ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడైన, రైన్‌హోల్డ్ మెస్నర్ కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశమిచ్చింది కానీ, ఆయన దాన్ని తిరస్కరించాడు.

ప్రతి సంవత్సరం వేల సంవత్సరాలనాటి సంప్రదాయాన్ని పాటిస్తూ వేలమంది కైలాస పర్వతానికి తీర్థయాత్ర చేస్తారు. అనేక మతాలకి చెందిన యాత్రికులు కైలాస పర్వతాన్ని పాదాలతో చుట్టిరావడం పుణ్యఫలదాయకమైన పవిత్ర ఆచారంగా నమ్ముతారు. హిందువులు, బౌద్ధులు ఈ ప్రదక్షిణాయాత్రని సవ్యదిశలో చేస్తారు. జైన, బోన్ పో మత అనుయాయులు ఈ పర్వతాన్ని అపసవ్య దిశలో చుడతారు. కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రదక్షిణామార్గం 52 కి.మీ (32 మైళ్లు) పొడవైనది.

కొంతమంది యాత్రికులు కైలాస పర్వత ప్రదక్షిణ మొత్తం ఒక్కరోజులోనే పూర్తి చెయ్యాలని నమ్ముతారు. అదంత సులభం కాదు. మంచి శారీరక పటుత్వంతో వేగంగా నడవగలిగే మనిషికి ఈ 52 కిలోమీటర్ల యాత్రను పూర్తి చెయ్యడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. అస్థిర వాతావరణం, ఎత్తుప్రదేశం వల్ల వచ్చే అస్వస్థత, ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి భయపడినప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని ఒక్క రోజులోనే పూర్తిచేస్తారు. అలాగే మరికొంతమంది యాత్రికులు మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ ప్రదక్షిణను పూర్తిచేస్తారు. యాత్రికుడు వంగి, మోకాళ్ళ మీద కూర్చొని, మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి, మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి, చేతులతో, మోకాళ్ళతో గుర్తిపెట్టిన స్థలం వరకు ప్రాకి మళ్లీ మళ్లీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు. ఈ విధంగా ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓరిమి అవసరమవుతుంది. ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో మారుమూల ప్రాంతంలో, ఆశ్రయం ఇవ్వడానికి కూడా ఎలాంటి జనావాసాలు కూడా లేని చోట ఉంది. యాత్రికుల సౌకర్యార్థం కొన్ని ఆధునిక వసతులైన బెంచీలు, విశ్రాంతి ప్రదేశాలు, ఉపాహార కేంద్రాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాలు, పవిత్రమైన ఈ పర్వతంపై కాలు పెట్టటం మహా పాపమని నమ్ముతాయి. ఈ నమ్మకాన్ని మూఢనమ్మకంగా నిరూపించటానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెపుతారు. ఇక్కడినుండి స్వర్గానికి సోపానమార్గముందని కూడా భక్తులు నమ్మకం.

చదవండి మన ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలు

Share

Recent Posts

ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం…

2 years ago

Sri Lakshmi Ashtottara Shatanamavali Telugu శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం…

2 years ago

Aura Sheath and it’s 7 layers ఆరా షీత్ – దాని 7 పొరలు – విశ్లేషణ

ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ…

2 years ago

షడ్రసముల వివరణ

షడ్రసముల గురించి వివరణ షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై…

2 years ago

Best Ayurveda books in telugu ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు

ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు - ఆయుర్వేద ప్రశస్తి . - 1986 .ఆంగ్ల…

2 years ago

మన సనాతన హిందూ ధర్మం – మత్యయంత్రం తెలుగులో

 *యంత్రము, మంత్రము, తంత్రము.*  హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని స‌ర్వ‌శ‌క్తులు ఆదిశ‌క్తి…

2 years ago